తొర్రూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం

52చూసినవారు
తొర్రూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం
యోగ ద్వారా మానసిక పునరుత్తేజానికి అవకాశం ఉందని సిఐ టి. సంజీవ్ అన్నారు. శుక్రవారం పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని తొర్రూర్ లోని యతి రాజారావు పార్కులో ప్రపంచ యోగ దినోత్సవం వేడుకల్ని పోలీసులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తొర్రూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ టి. సంజీవ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తొర్రూరు, నెళ్లికుదురు, నరసింహులపేట, పెద్దవంగర మండలాల ఎస్సై లు, పోలీసులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్