జనగామ జిల్లాలోని జనగామ చౌరస్తా సెంటర్ లో డా. బీ. ఆర్. అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తదితరులు పూలమాల వేసి నివాళులు అర్పించారు.