జనగామ జిల్లా కొడకండ్ల మండలం నీలిబండ తండాలో ఆదివారం గూగులోతు నీలా అనే మహిళ కానిస్టేబుల్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. వరంగల్ హెడ్ క్వార్టర్స్ లో ఏ ఆర్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న నీల తనకు పెళ్లి సంబంధాలు కుదరడం లేదని మనస్థాపం చెంది ఇంట్లో స్లాబ్ కి ఉరి వేసుకొని మృతి చెందింది.
కొడకండ్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.