
త్వరలో ‘ఎన్టీఆర్ బేబీ కిట్లు’ .. టెండర్లకు పిలుపు
AP: ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించిన మహిళలకు ప్రభుత్వం త్వరలో ఎన్టీఆర్ బేబీ కిట్లు అందించనుంది. 2016లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టగా.. గత వైసీపీ ప్రభుత్వం నిలిపివేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ ఈ పథకాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు కాంట్రాక్ట్ పద్ధతిలో కిట్లు సరఫరా చేసేందుకు టెండర్లను పిలిచింది. ఈ కిట్లో 11 రకాల వస్తువులు ఉంటాయి. దోమ తెరతో కూడిన పరుపు, నాప్కిన్లు, సబ్బు, పౌడర్ తదితర వస్తువులు ఉంటాయి.