జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామంలో శనివారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు. పర్యటనలో భాగంగా పలువురు కార్యకర్తలు, ప్రజలతో మాజీ మంత్రి మాట్లాడి సమస్యలు, బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు కోసం ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు.