జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్యక్షుడు దామేరా రవీందర్ ఆధ్వర్యంలో ఆదివారం గ్రామపంచాయతీ వద్ద కంటి డాక్టర్లచే కంటి పరీక్షలు నిర్వహించారు. కంటి ఆపరేషన్ అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్ చేయిస్తామని, దూరపు చూపు, దగ్గర చూపు లోపం ఉన్నవారికి తగిన అద్దాలు ఇప్పిస్తామని క్యాంపు నిర్వహించి హైదరాబాద్ సరోజినీ హాస్పిటల్ పంపారు.