మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెలికట్ట గ్రామంలోని ఐఓసీ పెట్రోల్ బంక్ లో శుక్రవారం కారు అగ్నిప్రమాదానికి గురైంది. దీంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పెట్రోల్ బంక్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.