అంగన్వాడీల హక్కుల కోసం జూలై 9న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కుంట ఉపేందర్ కోరారు. మహబూబాబాద్‌లోని జగన్నాధం భవనంలో శనివారం జరిగిన అంగన్వాడీ యూనియన్ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్రం కార్మిక చట్టాలను రద్దు చేసి, నాలుగు లేబర్ కోడ్‌లు తీసుకువచ్చిందని విమర్శించారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం రూ. 26,000 ఇవ్వాలన్నారు.