జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కామారెడ్డి గూడెం కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మొలుగూరి రమేష్ దశదిన కార్యక్రమానికి శనివారం హాజరయ్యెందుకు వెళ్లిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ని రావద్దు అంటూ కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. కనీసం హాస్పిటల్లో ఉన్నప్పుడు కానీ, చనిపోయిన రోజు కానీ పరామర్శించడానికి రాని మీరు ఇప్పుడు ఎందుకు వస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దశదిన కార్యక్రమం నుండి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వెళ్లిపోయారు.