పాలకుర్తి మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ వ్యవసాయ మార్కెట్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ హనుమండ్ల ఝాన్సీ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ లావుడ్య మంజుల, డైరెక్టర్లు, సొసైటీ చైర్మన్ అశోక్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సత్యనారాయణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుమారస్వామి గౌడ్, మండల పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.