జనగాం జిల్లా పాలకుర్తి ఎమ్మెల్యే హనుమాండ్ల యశస్వినిరెడ్డి పాలకుర్తి మండల కేంద్రానికి రానున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు మంగళవారం తెలిపాయి. బుధవారం ఉదయం 10 గంటలకు పాలకుర్తి మండల పరిషత్ కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో హాజరు కానున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గస్థాయి కాంగ్రెస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు.