మల్లంపల్లిలో బీభత్సం చేసిన కోతులు

76చూసినవారు
మల్లంపల్లిలో బీభత్సం చేసిన కోతులు
పాలకుర్తి మండలం మల్లంపల్లి గ్రామంలో శుక్రవారం కోతులు బీభత్సం సృష్టించాయి. గ్రామానికి చెందిన గంగారపు సోమయ్య ఇంట్లోకి గుంపులుగా చొరబడి ఇంట్లోని సామగ్రి, బియ్యం, నిత్యవసర సరుకులు, బట్టలను చెల్లా చెదురు చేశాయి. దీంతో తీవ్ర నష్టం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో కోతుల బెడద లేకుండా చేయాలని కోరారు. ఇప్పుడు కనీసం వండుకోవడానికి బియ్యం కూడా లేవని వాపోయారు.

సంబంధిత పోస్ట్