పాలకుర్తి మండల కేంద్రంలోని అత్యంత పురాతనమైన, మహిమాన్వితమైన, భక్తులు కోరిన కోరికలు తీర్చే శ్రీ పాటిమీది ఆంజనేయస్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం వివిధ గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో మండల దీక్ష స్వీకరించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకొని విశేష పూజలు నిర్వహించారు.