జనగామ జిల్లా పాలకుర్తిలోని శ్రీసోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామివారికి ఓ భక్తుడు వెండి కిరీటాన్ని సమర్పించాడు.
మహబూబాబాద్ జిల్లా కంటాయపాలెం గ్రామానికి చెందిన ఇటుకల రాజు-శ్రావణి దంపతులు రూ. 32వేల విలువైన 258 గ్రాముల వెండి కిరీటంను సోమవారం ఈవో సల్వాది మోహన్ బాబు ఆధ్వర్యంలో ఆలయానికి అందజేశారు.
కాగా, స్వామి వారి ఆశీస్సులు వారిపై ఎల్లవేళల ఉండాలని వేదపండితులు వారిని ఆశీర్వదించారు.