పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. హైదరాబాద్ నుంచి పాలకుర్తికి వస్తున్న క్రమంలో జనగామ ఫ్లై-ఓవర్ వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరగగా ఎమ్మెల్యే తన వాహనాన్ని ఆపి గాయపడిన వారి వద్దకు వెళ్లి మాట్లాడారు. అనంతరం అంబులెన్స్ వచ్చే వరకు ఎమ్మెల్యే ఉండి వారిని ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లను కోరారు.