జనగామ జిల్లా పాలకుర్తి మండలం కుక్కలగూడూరు ఉపాధిహామీ కూలీలతో కాంగ్రెస్ నాయకురాలు మనాలి ఠాకూర్ గురువారం సమావేశమయ్యారు. గ్రామ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఆమె తెలిపారు. పిల్లల విద్యా భివృద్ధికి కృషి చేస్తామన్నారు. అనంతరం కూలీలకు ORS ప్యాకెట్లను పంపిణీ చేశారు. సమావేశంలో ఆమెతో పాటు కాంగ్రెస్ నేతలు ఉన్నారు.