మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలం మోత్య తండాలో టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి పల్లె బాట కార్యక్రమం లో ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. తమ తండాలో మౌలిక వసతులు సరిగా లేవని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని శనివారం ఝాన్సీ రెడ్డిని తండావాసులు నిలదీశారు. దీంతో సమాధానం చెప్పకుండానే ఝాన్సీ రెడ్డి అక్కడి నుండి వెళ్లిపోయింది.