రాయపర్తి మండల కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ శాశ్విత విగ్రహాల కమిటీ ఆధ్వర్యంలో ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి అధ్యక్షులు దళితరత్న అయిత మల్లేష్, ప్రధాన కార్యదర్శి గారే శ్రీనివాస్ స్థానిక ప్యాక్స్ డైరెక్టర్ కుంట రమేష్ పూలమాల వేసి ఆదివారం నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ భారతదేశంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం ఆలు పెరగని కృషి చేసిన సంఘసంస్కర్త, స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.