జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని స్వయంభువు శ్రీ సోమేశ్వర లక్ష్మి నరసింహ స్వామి దేవాలయ ప్రాంగణంలోని శ్రీ చండిక అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో శుక్రవారం సందర్బంగా అమ్మవారికి శ్రీ సూక్త విధానేనా అభిషేకం, ప్రత్యేక అలంకరణ, నైవేద్యం అనంతరం హారతి సమర్పించి భక్తులకు దర్శనం కలిపించారు. అనంతరం భక్తులకు శ్రీ చండికా అమ్మవారి ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందించారు.