తొర్రూరు మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ ఉపాధి హామీ భవనం చెత్తా చెదారం, పిచ్చి మొక్కలతో నిండిపోయి, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. ఉపాధి హామీ భవనం ఉపయోగంలో లేకపోవడంతో ప్రజాధనం దుర్వినియోగమవుతోందని స్థానికులు విమర్శిస్తున్నారు. అధికారులు ఉపాధి హామీ భవనం చుట్టూ ఉన్న చెత్తా చెదారం, పిచ్చి మొక్కలను తొలగించి ప్రభుత్వ కార్యకలాపాలకు ఉపయోగించాలని బుధవారం కోరారు.