తొర్రూరు మండలం చెర్లపాలెంలో ఇందిరమ్మ ఇండ్లను కొంతమంది అనర్హులకు కేటాయించిన ఇండ్లను రద్దుచేసి అర్హులైన ఇండ్లు లేని పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని చర్లపాలెం గ్రామ ముదిరాజ్ సొసైటీ కార్యదర్శి పులుగుజ్జ మహేష్ డిమాండ్ చేశారు. శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మహేష్ మాట్లాడుతూ గజ ప్రభుత్వ పాలనలో పేద మధ్యతరగతి కుటుంబాల ప్రజలు మోసపోయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఈ ప్రజా ప్రభుత్వంలో కూడా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాల్సింది పోయి అనర్హులైన ఆస్తులున్న కోటీశ్వరులకు ఇండ్లు మంజూరు చేయడం సరికాదని అన్నారు.