జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జి ఝాన్సీరెడ్డి నియోజకవర్గం లో మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా చిరువ్యాపారులను పలకరించారు. తొర్రూరు పట్టణంలోని ఓ టీ స్టాల్లో ఆగి, నాయకులు, కార్యకర్తలతో కలిసి బెల్లం టీని ఆస్వాదిస్తూ సరదాగా గడిపారు. ఈ సందర్భంగా ప్రజలతో మమేకమై వారి సమస్యలను ఆలకిస్తూ, స్నేహపూర్వక వాతావరణంలో తమ అనుభవాలను పంచుకున్నారు.