రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాతకంగా చేపట్టిన భూభారతి చట్టం ద్వారా భూ సమస్యలు పరిష్కరించేందుకు రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యలు పరిష్కరించుకోవాలని తొర్రూరు తహసిల్దార్ గడీల శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మండలంలోని మడిపల్లి గ్రామంలో తహసిల్దార్ ఆధ్వర్యంలో. పోలేపల్లి గ్రామంలో డిప్యూటీ తహసిల్దార్ నర్సయ్యల ఆధ్వర్యంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులలో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.