మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం బొమ్మకల్లు గ్రామపంచాయతీ నుంచి వ్యక్తిగత ఖాతాకు నిధులు మళ్ళించుకున్నందుకు తొర్రూరు ఎంపీడీవో నర్సింగరావు పై గురువారం జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బొమ్మకల్లు గ్రామపంచాయతీ ఖాతా నుండి 1లక్ష 10వేల రూపాయలను ఎంపీడీవో నర్సింగరావు వ్యక్తిగత ఖాతాకు జమ చేసుకున్నారని ఫిర్యాదు రావడంతో విచారణ చేపట్టిన జిల్లా కలెక్టర్ ఎంపీడీవో నరసింహారావును సస్పెండ్ చేశారు.