

చెట్టును ఢీకొట్టిన స్కూల్ బస్సు.. ఐదుగురు విద్యార్థులకు గాయాలు (వీడియో)
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గ్రేటర్ నోయిడా వెస్ట్‌లోని బిస్రాఖ్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్కూల్ బస్సు అదుపు తప్పి ఓ చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు విద్యార్థులకు తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గాయపడినవారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.