హనుమకొండ డిపో ఆర్టీసీ డ్రైవర్లకు బుధవారం వాటర్ క్యాన్లు, జూట్ బ్యాగులు, టవల్, ఓఆర్ఎస్ పాకెట్స్ లను వరంగల్ ఆర్టీసీ ఆర్ఎండీ విజయభాను పంపిణీ చేశారు. రాంనగర్ లోని హనుమకొండ డిపోలో డీఎం భూక్యా ధరంసింగ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఎం లు కే భాను కిరణ్, మహేష్, డిపో సూపర్ వైజర్స్ నజియా సుల్తానా, వీ చంద్రశేఖర్, డ్రైవర్స్, ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.