వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ముందు సభకు అనుమతించకపోవడంతో హైకోర్టుకు బీఆర్ఎస్ నాయకులు వెళ్లారు. ఈ కేసు కోర్టులో ఉండగా సభకు పోలీసులు అనుమతించారు. ఈనెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ జరగనుంది. వరంగల్ పోలీసుల అనుమతితో కోర్టులో వేసిన కేసును శనివారం బీఆర్ఎస్ నాయకులు విత్ డ్రా చేసుకున్నారు.