వరంగల్: యాత్ర స్థలాలకు ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీలు

81చూసినవారు
వరంగల్: యాత్ర స్థలాలకు ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీలు
ప్రత్యేక యాత్ర స్థలాలు చూడాలనుకునే వారికి ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీని ఇస్తున్నట్లు హనుమకొండ ఆర్టీసి డిపో మేనేజర్ భూక్యా ధరంసింగ్ తెలిపారు. ‌నాగార్జునసాగర్, బోగతజలపాతం, శ్రీశైలం, పాండవుల గుట్టలు, గుహలు, కాళేశ్వరదేవాలయం, కాళేశ్వరం ప్రాజెక్టు వేములవాడ, కొండగట్టు ఆలయాల దర్శనానికి ప్రత్యేక టూర్ ప్యాకేజీలను ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. మరిన్ని వివరాలకు 897781103ను సంప్రదించాలన్నారు.

సంబంధిత పోస్ట్