పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు ఆర్థిక సహాయం

69చూసినవారు
పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు ఆర్థిక సహాయం
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నడికూడ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో చదివిన (2006-07) పూర్వ విద్యార్థులు గురువారం పాఠశాల అభివృద్ధి కోసం తమ వంతుగా రూ. 10 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. విద్యార్థుల సౌకర్యార్థం ఉపయోగించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఈ ఆర్థిక సహాయాన్ని అందజేశామని పూర్వ విద్యార్థులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్, రంజిత్, సాయి, కృష్ణ, వేణుగోపాల్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్