ప్రపంచ ఆటో డ్రైవర్స్ డే సందర్బంగా గురువారం నడికూడ మండల కేంద్రంలో వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ముఖ్య అతిథిగా వచ్చిన పరకాల ఎస్ఐ రమేష్ చేతుల మీదుగా కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నడికూడ మండల అధ్యక్షులు చెలిక రాజు, ఉపాధ్యక్షులు అల్లం వజ్రం, గౌరవ అధ్యక్షులు దూరిశెట్టి రవి, మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మల్హల్ రావు, ఇతర గ్రామ అధ్యక్షులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.