మహిళా శక్తి గ్రూప్ సభ్యులు ఏర్పాటుచేసిన యూనిట్లు తయారు చేసే ఉత్పత్తులకు బ్రాండింగ్ (గుర్తింపు), యూనిట్ల ముందు బోర్డులు వెంటనే అమర్చాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. పరకాల మండలంలోని మల్లక్కపేటలో ఉన్న ఇందిరా మహిళా శక్తి గ్రూప్ సభ్యులు మైక్రో ఎంటర్ప్రైజెస్లో భాగంగా ఏర్పాటు చేసిన మమతా టైలరింగ్ & క్లాత్ స్టోర్స్, పిండి గిర్నిని కలెక్టర్ పరిశీలించారు.