రాష్ట్రంలోని స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వం ఆరోగ్య భద్రత కల్పిస్తుందని సీఎం అన్నారు. వి హబ్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో సీఎం తో కలిసి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి “విమెన్ యాక్సిలరేషన్ ప్రోగ్రాం”ను ప్రారంభించారు. స్వయం సహాయక సంఘాల మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు.