హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని వైద్య సేవలు, సౌకర్యాలను పరిశీలించి, రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో పేషెంట్స్, అటెండెట్స్ కు ఇస్తున్న ఆహార మెనూను పరిశీలించారు. అనంతరం ఆస్పత్రిలోని వివిధ రకాల వైద్య పరికరాలను పరిశీలించారు.