కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రైతుల సంక్షేమానికి వారి ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. గురువారం ఊకల్ రైతు సేవా సహకార సంఘం పాలకమండలి, అధికారులతో కలిసి నిర్వహించిన సదస్సులో పాల్గోన్నారు. అర్హత కలిగిన ప్రతి రైతు లోన్ తీసుకొనే సదుపాయం ఉంది అని, రైతులకు పంటలపై అవగాహన కల్పించాలన్నారూ. రైతు రుణమాఫీ వల్ల రైతు కుటుంబాల్లో ఆనందం నింపిందని అన్నారు.