బీఆర్ఎస్ నాయకులు చేస్తుంది దీక్ష దివాస్ కాదని దొంగ దీక్ష అని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. శుక్రవారం సంగెం రైతు వేదికలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకులు సెంటిమెంట్ రాజకీయాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. నిరాహార దీక్ష పేరుతో ఫ్లూయిడ్స్ దీక్ష చేసి అద్భుతంగా నటించి ప్రజలను మోసం చేసిన దొంగ కేసీఆర్ అని తెలిపారు.