పరకాల మున్సిపల్ పరిధిలోని పాత మసీదు రోడ్డులో 14వ వార్డ్ కౌన్సిలర్ మార్క ఉమాదేవి రఘుపతి గౌడ్ ఆధ్వర్యంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు పరకాల మున్సిపల్ ఛైర్మన్ సోదా అనిత రామకృష్ణ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ పసుల లావణ్య రమేష్, ఎన్ ఎస్ యు ఐ జాతీయ కోఆర్డినేటర్ మార్క అభినయ్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ వార్డు అధ్యక్షుడు కొక్కిరాల స్వాతి-తిరుపతిరావు, తదితరులు పాల్గొన్నారు.