వరంగల్ జిల్లా గీసుగొండ మండలం కొమ్మాల మచ్చాపురం వరంగల్ నర్సంపేట ప్రధాన రహదారిపై గురువారం బొలేరో వాహనం, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. మిర్చి లోడ్ తో వెళుతున్న వాహనం కారును ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని వరంగల్ ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న చేరుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.