గీసుగొండ మండలంలోని కొమ్మాల స్టేజీ వద్ద యూనియన్ బ్యాంకు ఎదురుగా ఉన్న కరెంట్ ట్రాన్స్ ఫార్మర్ లో నుండి గత వారం రోజులుగా పొగలు వస్తున్నాయి. స్థానికులు ఎప్పుడు పేలుతుందోనని భయపడుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పిన కూడా పట్టించుకోవడంలేదని మంగళవారం చుట్టుపక్కల స్థానికులు వాపోతున్నారు.