
ఎముక ఆరోగ్యంపై శుభాంశు శుక్లా అధ్యయనం
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న భారత వ్యోమగామి శుభాంశు శుక్లా శనివారం పలు శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించారు. భారరహిత స్థితిలో ఎముకల ప్రతిస్పందనపై అధ్యయనం చేసి, ఆస్టియోపొరోసిస్ చికిత్సకు మార్గం చూపే దిశగా ప్రయత్నించారు. అంతరిక్షంలో రేడియేషన్ ప్రభావాన్ని విశ్లేషించే ప్రయోగంతో భవిష్యత్ వ్యోమగాములకు రక్షణ చర్యలు అభివృద్ధి చేసే అవకాశం ఉంది. సూక్ష్మ ఆల్గేపై కూడా ప్రయోగాలు నిర్వహించారు.