పత్తి రైతులకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) మంచి గిట్టుబాటు ధరను కల్పిస్తుందని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అన్నారు. గురువారం పరకాల మండలం కామారెడ్డి పల్లి పరిధిలోని శ్రీ హనుమాన్ కాటన్ ఇండస్ట్రీస్ లో సీసీఐ పత్తి కొనుగోలు ప్రక్రియను చేపట్టగా కలెక్టర్ పరిశీలించారు. కొనుగోలుకు వచ్చిన, రానున్న పత్తి గురించిన వివరాలతో పాటు క్వింటాకు సీసీఐ అందిస్తున్న ధర, రైతుల వివరాలను తెలుసుకున్నారు.