పరకాల నడికూడ మండలం నర్సక్కపల్లి గ్రామంలో లారీలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారనే సమాచారం మేరకు వరంగల్ టాస్క్ఫోర్స్ పోలీసులు శుక్రవారం దాడులు చేసారు. ఈ సందర్భంగా డ్రైవర్ తోపాటు మరో ఇద్దరు వ్యక్తులు పారిపోయారు. మొత్తం రూ. 1లక్ష 56వేల విలువైన 60 క్వింటాళ్ల రైస్ బ్యాగులను స్వాధీనం చేసుకొని పరకాల పోలీసులకు అప్పగించినట్లు ఏసీపీ తెలిపారు.