పశుసంవర్ధక శాఖలో ఇటీవల జరిగిన ప్రమోషన్ లలో కె. వినయ్ పశు సంపద సహాయకులుగా ఆత్మకూరు మండలంలోని పెద్ధాపూర్ పశువైద్య ఉపకేంద్రం నకు నియమితులయ్యారు, వీరిని శనివారం ఆత్మకూరు మండల పశువైద్యులు డాక్టర్ ధర్మానాయక్ విధులలో చేర్చుకున్నారు. విధి నిర్వహణలో తన పరిధిలోని గ్రామాలలో పశు సంపద అభివృద్ధికి కృషి చేస్తానని వినయ్ అన్నారు.