భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల అభివృద్ధి అధికారి మహమ్మద్ హుస్సేన్ గుండెపోటుతో శనివారం మృతి చెందారు. పరకాల పట్టణ కేంద్రానికి చెందిన మహ్మద్ హుస్సేన్ చిట్యాల ఎంపీడీవో కార్యాలయంలో టైపిస్టుగా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. టైపిస్టు నుండి ప్రమోషన్ పొంది సూపరిండెంట్ గా విధులు నిర్వహిస్తూనే గత సంవత్సరం మొగుళ్ళపల్లి ఎంపీడీవో గా ప్రమోషన్ పై వచ్చారు. వచ్చేనెల మే లో రిటైర్డ్ కానున్నట్లు తెలిసింది.