గీసుగొండ మండలం లోని నంద నాయక్ తండా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు గారి జన్మదిన వేడుకలను
బుధవారం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిర్వహించాయి. ఈ సందర్బంగా మంత్రి వర్యులు కొండా సురేఖ గారు కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పరకాల లో గ్రూప్ రాజకీయం నడుస్తున్న క్రమంలో ఆమె స్వంత మండలంలో జన్మదిన కార్యక్రమం నిర్వహించడం ఎటు దారి తీస్తుందోనని కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు.