గీసుగొండ మండలంలోని ధర్మారం జడ్. పి. హెచ్. ఎస్ పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవం, గణిత పితామహుడు శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలు ఇన్ ఛార్జ్ ప్రిన్సిపాల్ కుమారస్వామి ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థిని విద్యార్థులు గణిత సమస్యలను చేయడంపై పట్టు సాధించాలని, పదవ తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని ఆయన సూచించారు.