డబ్బు కోసం మేనత్తను హత్య చేసి నగలు చోరీ చేసిన నిందితుడిని వరంగల్ జిల్లా గీసుగొండ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ కు చెందిన ప్రణయ్ మద్యం, జల్సాలకు అలవాటు పడి, డబ్బు కోసం మేనత్తను హత్య చేశాడు. నిందితుడి వద్ద రూ. 18లక్షల విలువగల 170 గ్రా. బంగారు, 34 గ్రా. వెండి అభరణాలు, రూ. 10వేల నగదు, బైకు, ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.