హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని సీఎస్ఐ చుట్టూ పరిసర ప్రాంతాలు మరియు చర్చి ఆవరణలోని ప్రదేశమంతా కూడా శుభ్రం చేయించాలని మాజీ మున్సిపల్ ఒకటో వార్డు కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్, కమిషనర్ వెంకటేష్ ను బుధవారం కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 18న గుడ్ ఫ్రైడే 20న ఈస్టర్ పండుగ సందర్భంగా చర్చి పరిసర ప్రాంతాలు శుభ్రం చేయించాలని కోరగా స్పందించిన కమిషనర్ త్వరగా పనులు చేపడతామని అన్నారు.