పరకాల పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది ఒంటేరు రాజమౌళి-సునంద కుమారుడు పృథ్వీరాజ్ -సుజల ప్రియదర్శిని వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు మున్సిపల్ మాజీ చైర్మన్ సోదా రామకృష్ణ, బొచ్చు సమ్మయ్య, బుచ్చు బాబు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. వీరి వెంట ఎస్సీ సెల్ అధ్యక్షులు బొమ్మకంటి చంద్రమౌళి, ఒంటేరు సుధాకర్, బొచ్చు బిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.