పరకాల పట్టణంలో పేద బడుగు బలహీన వర్గాలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంపై పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రము చేయలేని విధంగా మంగళవారం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేసినందుకు ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి బడ్జెట్లో గుండు సున్నా ఇచ్చి తెలంగాణలో సన్న బియ్యం ఇస్తుంటే ఓర్వలేక డీలర్ షాపులలో ఫ్లెక్సీలు పెట్టుకుంటున్నారని ఆయన అన్నారు.