పరకాల: ఫైర్ ఆఫీసర్ భద్రయ్య ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాలు

51చూసినవారు
పరకాల: ఫైర్ ఆఫీసర్ భద్రయ్య ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాలు
పరకాలలో గురువారము జాతీయ అగ్నిమాపక వారోత్సవాలు ఫైర్ ఆఫీసర్ భద్రయ్య ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సందర్భంగా ఆయన తన సిబ్బందితో మాదారం ఏరియాలోని హాస్పటల్ తో పాటు పలు కాలనీల ప్రజలకు అగ్ని ప్రమాదాల నివారణ చర్యల గూర్చి మాట్లాడుతూ గ్యాస్ లీక్ అవ్వడం, విద్యుత్ షార్ట్ సర్క్యూట్, చెరువులు, బావులలో ఈతకు వెళ్లి ప్రమాదాలకు గురైనప్పుడు నివారణకై తగు సూచనలు చేయడం జరిగిందన్నారు. విద్యుత్ ప్రమాదాలు నివారణ చర్యలు గురించి అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్